Surprise Me!

సినీ, రాజకీయాల్లో అన్నగారిది చెరగని ముద్ర.. NTR సినీ వజ్రోత్సవంలో నందమూరి రామకృష్ణ | Asianet Telugu

2025-06-07 293 Dailymotion

ఎన్నారై తెలుగు దేశం పార్టీ, అక్లాండ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్ లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్ వర్క్ చైర్మన్ టి.డి. జనార్థన్, వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి, శాసన సభ్యులు బోడే ప్రసాద్, ఆత్మీయ అతిథిగా నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. దీపప్రజ్వలన కార్యక్రమం అనంతరం ‘తారకరామం’, ‘స్వర్ణాంధ్ర సారధి నారాచంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ రెండు ప్రతులు ఆవిష్కరించారు. అనంతరం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సప్తసముద్రాలు దాటి వచ్చి ఇక్కడ తెలుగు వారి సమక్షంలో అన్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకను జరుపుకోవడం అపూర్వమని కొనియాడారు. ఎన్టీఆర్ ధరించిన పాత్రల ప్రభావం ఆయన వ్యక్తిత్వంపై వుండేదని పేర్కొన్నారు. చైనా యుద్ధం, రాయలసీమ కరువు, దివిసీమ తుఫాను మొదలైన విపత్తులు సంభవించినప్పుడు తోటి కళాకారులతో కలసి నాటకాలు ప్రదర్శించి, జోలెపట్టి విరాళాలు సేకరించి ఆపన్నులను ఆదుకున్నారని, దేశాభిమానాన్ని చాటిచెప్పారని పెర్కొన్నారు. రాజకీయాలలోకి వచ్చి కర్షక, కార్మిక, మహిళ పక్షపాతిగా అనేక విప్లవాత్మక పథకాలు పెట్టారని గుర్తుచేశారు. తిరుమల తిరుపతిలో మొట్టమొదటిసారి అన్నదాన పథకం మొదలు పెట్టింది ఎన్టీఆరేనని, ఆయన కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సకృతంగా పేర్కొన్నారు.

#ntr #nandamuriramakrishna #nandamurifamily #ntrcinevajrotsavam #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️